Thursday, November 27, 2008

సమాచారం పొందటం ఎలా ?

సమాచారం పొందటం ఎలా ?

దరఖాస్తు

  • తెలుగులో దరఖాస్తు చేసుకోవచ్చును.
  • కోరుతున్న సమాచార వివరాలు నిర్దిష్టంగా వుండాలి .
  • సమాచారం అడగడానికి కారణాలు చెప్పనవసరం లేదు.
  • వుత్తర ప్రత్యుత్తరాల నిమిత్తం చిరునామా ఇవ్వాలి .
  • మీరు సమాచారం కోరుతున్న సంస్థ కార్యాలయం లో వుండే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు లేదా వారి సహాయకులుగా నియమింపబడిన వారికి దరఖాస్తు చేయాలి.

Wednesday, November 26, 2008

రికార్డుల, పనుల పరిశీలన

రికార్డుల, పనుల పరిశీలన
  • ఈ అన్ని సంస్థలలో రికార్డులను పరిశీలించ వచ్చును. వాటి నుండి నోట్సు తీసుకోవచ్చును . వాటి సర్టిఫైడ్ కాపీలు పొందవచ్చును.
  • ప్రభుత్వం నిర్వహించే వివిధ పనుల పరిశీలనకు ,సర్టిఫైడ్ శాంపిల్స్ పొందడానికి వీలుంది.

Monday, November 24, 2008

ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యకలాపాల సమాచారం

ప్రభుత్వ శాఖలు ,సంస్థల కార్యకలాపాల సమాచారం

  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ,న్యాయస్థానాలు , శాసనసభలు పోలీసు తదితర సంస్థలు , పంచాయితీలు, మున్సిపల్ కార్యాలయాల అధీనంలో వున్నసమాచారం పొందవచ్చును. అవి అందించే సేవలు, నిర్వహిస్తున్న పథకాలు, లబ్దిదారుల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చును. ఈ సంస్థల బడ్జెట్లు, జమా ఖర్చుల పట్టికలు పొందవచ్చును .

Sunday, November 23, 2008

ఏం తెలుసుకోవచ్చు?
  • మీ ప్రాంతంలో రేషన్ షాపులో నెలవారీ సరుకు,నాణ్యత వివరాలు .
  • మీరు ఒక ప్రభుత్వ పథకానికి పెట్టిన దరఖాస్తు ఏమైంది ?వాటిని ఎలా మంజూరు చేస్తారు ?లబ్దిదారుల జాబితాలు .
  • మీ ఆరోగ్యకేంద్రం అందించే సేవల వివరాలు , పనివేళలు , ఉండాల్సిన మందుల వివరాలు , పాఠశాలల సమాచారం, పారిసుభ్య వసతులు, భూమి రికార్డులు , పన్నుల వివరాలు .
  • మీ ప్రాతంలో ఒక రోడ్డు , ఒక ద్రైను, వేస్తుంటే దాని ఎస్టిమేటు కాపి , కాంట్రాక్టారు వివరాలు , నాణ్యత పరీక్షా కోసం సాంపిల్స్ తీసుకోవచ్చు .
సమాచార హక్కు చట్టం సుపరిపలనకి రాజమార్గం

శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి ఆధారం సమాచార హక్కు .సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12
నుంచి పూర్తిగా అమలులోకి వచ్చింది .ఈ చట్టం ద్వారా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు , వాటి ఖర్చులు ,
సంక్షేమ పథకాలు , సేవల పూర్తి సమాచారం మీరు అడిగి తెలుసుకోవచ్చు .